మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి శ్రీమతి కనగండ్ల కవిత-తిరుపతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చు రాజయ్య, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.