సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు తిప్పరవేణి రాజయ్య (శనివారం) విషపురుగు కాటుతో మృతి చెందారు. పిల్లి వాగు చెక్ డ్యాం వద్ద చేపలు పట్టే క్రమంలో నీటిలో విషపురుగు కుట్టడంతో ఆయన నోటి నుండి నురగ వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.