బెజ్జంకి: కల్లేపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

9చూసినవారు
బెజ్జంకి: కల్లేపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణతో కలిసి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, గ్రామ సర్పంచ్ బిగుళ్ల మోహన్ ప్రారంభించారు. రైతులు తమ పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని, దళారులను నమ్మవద్దని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కమిటీ మండలాధ్యక్షులు ముక్కీస రత్నాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలివేరు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్