
ఇరాన్ పై మరికొంత కాలం దాడులు కొనసాగుతాయి: ట్రంప్
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సర్వశక్తులనూ తుడిచిపెట్టేందుకు మరికొంత కాలం దాడులు కొనసాగుతాయని, ఇరాన్ నాయకులు శాంతి ఒప్పందం కోసం ప్రాధేయపడుతున్నారని ఆయన తెలిపారు. ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నదని, ఇక పోరాడే స్థితిలో లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.




