గుర్జకుంట క్రాస్ రోడ్ వద్ద కారు ఢీకొని బైకర్ కు తీవ్ర గాయాలు

148చూసినవారు
చేర్యాల మండలం గుర్జకుంట క్రాస్ రోడ్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్జకుంట గ్రామానికి చెందిన నంగి చంద్రయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బైక్పై వెళ్తున్న చంద్రయ్యను కారు ఢీకొనడంతో ఆయన కాలు విరిగి, తలకు గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్