అయోధ్య రాముని సొమ్ము దోపిడీపై బీఎస్పీ నేత తీవ్ర విమర్శలు

704చూసినవారు
అయోధ్య రాముని సొమ్ము దోపిడీపై బీఎస్పీ నేత తీవ్ర విమర్శలు
సిద్దిపేట జిల్లాలో బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్, అయోధ్య రాముని ఆలయ ట్రస్ట్ చైర్మన్, ప్రధాన కార్యదర్శి తదితరులు 500 కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి, నగదు దోచుకున్నారని ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ సంఘటన తర్వాత ఈ దోపిడీ వార్తలు రావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి, ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాముని భక్తులు, జై శ్రీరామ్ అనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని, అసలు వారు హిందువులేనా అని ఆయన తీవ్రంగా విమర్శించారు.

సంబంధిత పోస్ట్