సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండల వ్యవసాయ అధికారిణి వెంకట్రావమ్మ మంగళవారం రైతు వేదికలో మాట్లాడుతూ, పంట అవశేషాలను కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ విజ్ఞప్తి చేశారు. పంట అవశేషాలు కాల్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, 2 ఎకరాలలోపు రూ. 2,500, 2-5 ఎకరాలకు రూ. 5,000, 5 ఎకరాలకు మించి కాల్చితే రూ. 15,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.