సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామంలో 25 సీసీ కెమెరాలను ప్రారంభించిన ట్రైనింగ్ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా, ఒక్క సీసీ కెమెరా 10 మంది జవాన్లతో సమానంగా పనిచేస్తుందని తెలిపారు. ఆన్లైన్ బెట్టింగులకు దూరంగా ఉండాలని, యువత కదలికలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా అమర్చుకోవాలని, దీనివల్ల నేరాలు తగ్గుముఖం పడతాయని ఆమె పేర్కొన్నారు. గ్రామంలో మద్యపాన నిషేధంపై పంచాయతీ పాలకవర్గం తీర్మాన పత్రాన్ని ఆమెకు అందజేశారు.