చేర్యాల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు అమ్మవారు మహాచండిక దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ నిర్వాహకులు, దంపతులు వేదమంత్రోచ్చారణలతో నవ దుర్గా చండి హోమం పూర్ణాహుతిని ఘనంగా నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ చేశారు.