సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కేంద్రంలోని పెద్ద చెరువు కట్ట సమీపంలో సోమవారం గంగపుత్ర సంఘం అధ్యక్షులు గుడిసె లక్ష్మయ్య, సభ్యుల ఆధ్వర్యంలో గంగాభవాని ఆలయ కమాన్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. పెద్ద చెరువు కట్టపై పలు దేవాలయాలు ఉండటం పట్ల కమాన్ నిర్మాణం చేపట్టడం సంతోషించదగ్గ విషయమని సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు.