చిన్నకోడూరు: లారీ, బైక్ ఢీకొని ఒకరు మృతి

0చూసినవారు
చిన్నకోడూరు: లారీ, బైక్ ఢీకొని ఒకరు మృతి
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని చెర్ల అంకిరెడ్డిపల్లి శివారులో గురువారం రాత్రి లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో మేడిపల్లి గ్రామానికి చెందిన కాశ బోయిన పోశయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. తన బంధువైన మహిళను శనిగరం వద్ద దింపడానికి వెళుతుండగా, రోడ్డు దాటుతున్న సమయంలో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్