సిద్దిపేట పట్టణంలోని స్థానిక మెదక్ రోడ్ లో గల మహాత్మా జ్యోతిభాపూలే బీసీ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజ్ ను జిల్లా కలెక్టర్ మనుచౌదరి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ వంటగది, స్టోర్ రూం, ప్రిన్సిపల్ గదులను పరిశీలించారు. అనంతరం 10వ తరగతి గదిలో విద్యార్థుల గణిత శాస్త్ర పరిజ్ఞానంను పరిశీలించి కాసేపు గణితశాస్త్ర సమస్యలను సులభంగా పరిష్కరించడంలో మెళకువలను నేర్పారు.