మార్కెట్ గోదాంలను పరిశీలించిన కలెక్టర్

0చూసినవారు
మార్కెట్ గోదాంలను పరిశీలించిన కలెక్టర్
దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఖాళీగా ఉన్న మార్కెట్ కమిటీ గోదామును కలెక్టర్ హైమావతి పరిశీలించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా వడ్ల నిల్వలు, కొనుగోలు అవసరాల కోసం వీటిని వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. వర్షాలకు రైతులు ఆందోళన చెందవద్దని, ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. రైతుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్