సిద్ధిపేట జిల్లా దుబ్బాక బల్వంతపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా ఆపరేషన్ సమయంలో ఓ-పాజిటివ్ బ్లడ్ అవసరమున్నదని సమాచారం తెలుసుకున్న కానిస్టేబుల్ భూమలింగం వెంటనే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ కు వెళ్లి బ్లడ్ డొనేట్ చేశారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులు బ్లడ్ డొనేట్ చేసిన కానిస్టేబుల్ కు కృతజ్ఞతలు తెలిపారు.