ప్రజల ప్రాణ రక్షణను దృష్టిలో ఉంచుకుని, ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజా (నైలాన్ దారాలు) వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని శనివారం సిద్ధిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి చైనా మాంజాను వాడినా లేదా అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, తమ పిల్లలను చైనా మాంజా వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. నిబంధనలు పాటిస్తూ, చైనా మాంజా వల్ల కలిగే ప్రమాదాల నుండి ప్రాణ భద్రతకు సహకరించాలని సూచించారు.