వారంలో కూతురు పెళ్లి ఉండగా తండ్రి మృతి చెందిన ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది. హైదరాబాద్ ECILలోని ఆర్టీవన్ కాలనీ వాసి బండి శ్రీనివాస్(50) తన కూతురిని సిద్దిపేట(D) కొండపాక (M) వెలికట్టెకు చెందిన యువకుడికి ఇచ్చి ఈనెల 13న పెళ్లి చేయాల్సి ఉంది. ఈ క్రమంలో చేర్యాల పరిధి ముస్త్యాలలో బంధువులకు పెళ్లి పత్రిక ఇచ్చేందుకు వెళ్తుండగా జనగామ జిల్లా ఆలీంపూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. బైక్, డీసీఎం వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.