ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం వ్యాన్

0చూసినవారు
ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం వ్యాన్
సిద్దిపేట నుంచి బుధవారం కరీంనగర్ వెళ్తున్న డీసీఎం వ్యాన్, పరకాల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సును బెజ్జంకి రాజీవ్‌ రహదారి క్రాసింగ్‌ వద్ద ఢీకొట్టింది. సిరిసిల్లలో సీఎం సమావేశానికి జనాలను తరలించేందుకు బస్సు వెళ్తున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు, అయితే డీసీఎం వ్యాన్ ముందు అద్దాలు పగిలాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్