సిద్దిపేటలో దట్టమైన పొగమంచు: ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

1చూసినవారు
ఈరోజు సిద్దిపేటలో అసాధారణంగా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం 9:30 గంటలైనా పొగమంచు తగ్గకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపించే ఈ పరిస్థితి సిద్దిపేటలో చోటుచేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ప్రకృతిలో వస్తున్న మార్పులకు సంకేతమా అని కొందరు భావిస్తున్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

సంబంధిత పోస్ట్