సిద్దిపేటతో సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఇళ్లు, చెట్లు, వాహనాలపై మంచు తుంపర్లు కురుస్తుండటంతో శీతల గాలులు ప్రజలను వణికిస్తున్నాయి. రోడ్లపై విజిబిలిటీ తగ్గడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.