ప్రభుత్వ పాఠశాలలో డైరీ ఆవిష్కరణ: విద్యార్థుల భవిష్యత్తుకు ముందడుగు

1చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలో డైరీ ఆవిష్కరణ: విద్యార్థుల భవిష్యత్తుకు ముందడుగు
సిద్దిపేట జిల్లా, బెజ్జంకి మండలంలోని గుండారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు సంబంధించిన డైరీని గుండారం గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి భీమయ్య ఆవిష్కరించారు. ప్రైవేట్ పాఠశాలలకు మాత్రమే పరిమితమైన డైరీలను ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని, ఇది పిల్లల హోంవర్క్‌ను నమోదు చేసి, తల్లిదండ్రుల సమక్షంలో పూర్తి చేయడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉండ్రాళ్ళ తిరుపతి, గ్రామ సెక్రెటరీ రమేష్, వార్డు సభ్యులు ఎలుక శ్రీశైలం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్