మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు జన్మదిన వేడుకలు బుధవారం సిద్దిపేట జిల్లా గుర్రాలగొంది గ్రామంలో ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న హరీశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల సేవలో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా గ్రామానికి చెందిన 18 మంది ఆటో కార్మికులకు రూ. 10 లక్షల ప్రమాద బీమా పథకానికి సంబంధించిన బాండ్లను పంపిణీ చేశారు.