సిద్దిపేటలో రూ. 22 లక్షల బీమా చెక్కుల పంపిణీ

3చూసినవారు
సిద్దిపేటలో రూ. 22 లక్షల బీమా చెక్కుల పంపిణీ
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బుధవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. పిఎంజెజెబివై పథకం కింద దౌల్తాబాద్‌కు చెందిన జిర్కపల్లి శ్యామల మరణించగా నామినీ అయిన భర్త స్వామికి రూ. 2 లక్షల చెక్కును అందజేశారు. అలాగే జిపిఎఐ ఎస్‌బిఐ జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా నర్సంపేట గ్రామస్థుడు వనం రాజు ప్రమాదవశాత్తు మరణించడంతో నామినీ రమ్యకు రూ. 20 లక్షల చెక్కును బ్రాంచ్ మేనేజర్ శ్యామ్ రావత్, స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్