సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి సందర్శించి, కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిల్లర్ ట్యాగింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని డిసిఎస్ఓను ఆదేశించారు. రైతులు తేమశాతం వచ్చేవరకు ధాన్యాన్ని కేంద్రంలో ఆరబోసి, సాయంత్రం కుప్పలు చేసుకుని టార్పాలిన్ కవర్లతో కప్పుకోవాలని, తద్వారా అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా ఉంటుందని సూచించారు. తేమశాతం వచ్చేవరకు పోలాల వద్ద ఆరబోయడం మంచిదని రైతులకు తెలిపారు.