ధాన్యం దిగుమతి చేసుకోవడంలో ఎలాంటి జాప్యం చేయవద్దు

0చూసినవారు
ధాన్యం దిగుమతి చేసుకోవడంలో ఎలాంటి జాప్యం చేయవద్దు
వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ హైమావతి మిల్లర్ యజమానులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్లో బాయిల్డ్ రైస్ మిల్లు ప్రతినిధులు, సివిల్ సప్లై అధికారులతో జరిగిన సమావేశంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 12,936 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు సివిల్ సప్లై అధికారి తనూజ తెలిపారు. తాలు తీసిన ధాన్యాన్ని మాత్రమే మిల్లులకు పంపాలని, అధికారులు, మిల్లర్ల సమన్వయంతో కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్