సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు శుక్రవారం మద్యం తాగి వాహనాలు నడుపుతున్న నలుగురు వాహనదారులకు రూ. 40,000 జరిమానా విధించారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో వీరు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. వీరితో పాటు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన మరో నలుగురికి రూ. 20,000 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.