సమాజంలో ప్రతి వ్యక్తి సమాజం మనకేమిచ్చింది అనే బదులు, సమాజానికి మనం ఏం చేస్తున్నామని బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తెలంగాణ జనరల్ సెక్రెటరీ జగ్గు మల్లారెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని గురునాథ హైస్కూల్లో 2009-2010 బ్యాచ్ పదోతరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి విద్యాబుద్ధులు నేర్పిన గురువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులను విస్మరించకూడదన్నారు.