సిద్దిపేట జిల్లా, దుబ్బాకలో అక్బర్పేట భూంపల్లి మండల ఉపసర్పంచుల ఫోరమ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా శనివారం ఎన్నికైంది. సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు మాడుగూరి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో దోర్నాల యాదగిరి అధ్యక్షుడిగా, దక్షిణమూర్తి ఉపాధ్యక్షుడిగా, పాతూరి నవీన్ గౌడ్ జనరల్ సెక్రటరీగా, జీడిపల్లి రమేష్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. మాచపురం ప్రశాంత్, గుర్జాల చంద్రం సలహాదారులుగా నియమితులయ్యారు.