జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా సిద్దిపేట డిపోలో 'సడక్ సురక్ష-జీవన్ రక్ష' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వన్ టౌన్ ఎస్సై డి. నవత మాట్లాడుతూ, డ్రైవర్లు విధి నిర్వహణలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి బస్సులు నడపరాదని, పట్టణంలో ఎక్కడపడితే అక్కడ బస్సులు ఆపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించరాదని సూచించారు. డిపో మేనేజర్ డి. భవభూతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.