సిద్ధిపేట: రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

1846చూసినవారు
సిద్ధిపేట: రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
శనివారం రాత్రి దుబ్బాక మండలంలోని హబ్సిపూర్ వద్ద సిద్దిపేట-రామాయంపేట రహదారిపై రోడ్డు ప్రమాదంలో రైతు బొంగురం మల్లారెడ్డి మృతి చెందారు. పొలం పనులు ముగించుకుని గేదెను తోలుకుని ఇంటికి వస్తున్న ఆయనను అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్తులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

సంబంధిత పోస్ట్