దుబ్బాక మండలంలోని పెద్దగుండవెల్లి గ్రామంలో అప్పులు తీర్చలేక గొర్రెల కాపరి చిగురు వెంకటి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల కొన్ని గొర్రెలు చనిపోవడంతో పాటు కుటుంబ పోషణ భారంగా మారడంతో తీవ్ర మనస్థాపానికి గురై వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కీర్తిరాజ్ తెలిపారు.