నాగలగిద్ద మండలం ముక్తాపూర్ కి చెందిన పర్యావరణ ప్రేమికుడు పాలడుగు జ్ఞానేశ్వర్ కు వజ్ర పురస్కారం దక్కింది. గత పదేళ్ల నుంచి పర్యావరణ రంగంలో చేస్తున్న విశేష కృషిని గుర్తించి సిద్దిపేట వ్యాస మహర్షి యోగా సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్, యోగా గురువు తోట సతీశ్, రామ్ రెడ్డి, తోట అశోక్ వజ్ర పురస్కారాన్ని అందించారు. తనకు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.