చెరిపితే చెరిగేది కాదు... తెలంగాణ రాష్ట్ర సాధన చరిత!

11చూసినవారు
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తన 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని చిన్నకోడూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గులాబీ జెండాను ఎగురవేశారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కాముని శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ త్యాగఫలమేనని, ఆయన, హరీష్ రావు లేకుండా తెలంగాణ ఏర్పాటు సాధ్యమయ్యేది కాదని అన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం 60 ఏళ్ల పోరాట కలను సాకారం చేయడానికి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కేసీఆర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని ఆయన కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్