గంజాయి ఇతర మత్తుపదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు

1చూసినవారు
గంజాయి ఇతర మత్తుపదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు
గంజాయి, ఇతర మత్తుపదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని సిద్ధిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు తెలిపారు. శనివారం నార్కోటిక్ డాగ్స్ తో ముస్తాబాద్ చౌరస్తా, డిగ్రీ కళాశాల ఏరియా, స్టేడియం వద్ద కిరాణా షాపులు, టీ కొట్టులు, అనుమానాస్పద ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా గంజాయి, మత్తుపదార్థాలు కలిగి ఉన్నా, అమ్మినా, విక్రయించినా వెంటనే డయల్ 100 లేదా తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాలని సూచించారు.

ట్యాగ్స్ :