సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ హైమావతి, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో పరిశ్రమల స్థాపన కీలకమని తెలిపారు. టీజీ ఐపాస్ లో పరిశ్రమల ఏర్పాటు దరఖాస్తులను పరిశీలించాలని, అవసరమైన మౌలిక వసతులను పర్యవేక్షించాలని, స్థాపనకు సుముఖంగా లేని దరఖాస్తులను తొలగించాలని సూచించారు.