దూలిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చారిత్రక వస్తువుల ప్రదర్శన నిర్వహించారు. మండల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం, తెలంగాణ కొత్త చరిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను మండల విద్యాధికారి అనుముల కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. రాతియుగాల నాటి రాతి పరికరాలు, శాతవాహన–ఇక్ష్వాకుల కాలం నాటి నాణేలు, టెర్రకోట బొమ్మలు, వృక్షశిలాజాలు, సింధు నాగరికతకు సంబంధించిన వస్తువులను ప్రదర్శించారు. చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ విద్యార్థులకు వాటి ప్రాధాన్యతను వివరించారు.