సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ బుధవారం పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అక్కడ గడువు తీరిన వస్తువులు అమ్ముతున్నట్లు గుర్తించి, రూ. 20వేల జరిమానా విధించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని, వినియోగదారులు వస్తువులు కొనేముందు గడువు చూసుకోవాలని కమిషనర్ హెచ్చరించారు.