అంతరించిపోయిన ఆటలు వెలికి తీసి నేటి తరానికి తెలియ జేయాలి

523చూసినవారు
అంతరించిపోయిన ఆటలు వెలికి తీసి నేటి తరానికి తెలియ జేయాలి
సిద్దిపేట జిల్లా కేంద్రంలో చిర్రగోనె టోర్నమెంట్ ను ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న వాలీబాల్, చిర్ర గొనె, కోకో వంటి ఆటలను నేటి తరానికి అందించాలని అన్నారు. ఈ ఆటల వల్ల శారీరకంగా, ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, కానీ నేటితరం ఫోన్లలో ఆన్లైన్ ఆటలు ఆడుతూ చిన్నప్పటి నుండే వ్యాధులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతరించిపోయిన చిర్ర గొనె ఆటను మళ్ళీ గుర్తు చేయడం, నేటి తరానికి తెలియజేయడం సంతోషంగా ఉందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్