ప్రైవేటు ఆసుపత్రిలో నకిలీ వైద్యుడిని తనిఖీల్లో గుర్తించారు. సిద్దిపేట పట్టణంలోని లలితా భవాని మల్టీ స్పెషాలిటీ ప్రైవేటు ఆసుపత్రిలో నకిలీ వైద్యుడు రాత్రి సమయంలో మద్యం తాగి ట్రీట్మెంట్ చేస్తున్నట్లు ఫిర్యాదు అందినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు రాకేశ్ తెలిపారు. తనిఖీలో అజయ్ కుమార్ నకిలీ సర్టిఫికెట్స్‌తో వైద్యం చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అతనిపై కేసు నమోదు చేశామన్నారు.