కూరగాయల సాగుతో రైతు భూక్య రాజు నాయక్ ఆదాయం రెట్టింపు

748చూసినవారు
సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలం శ్రీరామ్ తండా గ్రామపంచాయతీకి చెందిన రైతు భూక్య రాజు నాయక్, గత నాలుగు సంవత్సరాలుగా వంకాయ, మిర్చి, టమాట, కాకరకాయ, బీరకాయ, క్యాబేజీ వంటి కూరగాయలను సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. పండిన పంటలను సమీప గ్రామాల వారపు సంతల్లో విక్రయిస్తూ రోజుకు రూ.1000 నుండి రూ.2000 వరకు సంపాదిస్తున్నట్లు ఆయన తెలిపారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే కూరగాయల సాగు ద్వారా తక్కువ సమయంలోనే అధిక లాభాలు పొందవచ్చని, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సాగు చేస్తే ఇతర రైతులు కూడా మెరుగైన ఆదాయం పొందవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్