వరి కొయ్యలు తగలబెడుతూ రైతు సజీవదహనం

5చూసినవారు
వరి కొయ్యలు తగలబెడుతూ రైతు సజీవదహనం
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో గురువారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పొలంలో వరి కొయ్యలను తగలబెడుతుండగా, గాలి తీవ్రతతో మంటలు పెరిగి, దట్టమైన పొగ అలుముకుంది. ఊపిరాడక, వేడికి స్పృహతప్పి పొలంలోనే పడిపోయిన రైతు మద్దెల మల్లయ్య (60) మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. మిరుదొడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్