ధాన్యం కొనడం లేదని రైతుల ఆందోళన: రహదారి దిగ్బంధం

0చూసినవారు
ధాన్యం కొనడం లేదని రైతుల ఆందోళన: రహదారి దిగ్బంధం
సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారి ముండ్రాయి వద్ద నంగునూరు మండలంలోని తిమ్మయిపల్లి రైతులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహంతో బైఠాయించారు. తాలు, తేమ శాతం, నాణ్యత పేరుతో కొనుగోలు నిరాకరిస్తున్నారని, సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించేంత వరకు నిరసన కొనసాగుతుందని తెలిపారు. దీంతో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్