సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వ్యవసాయ అధికారులు శివరామకృష్ణ, స్వాతిక గురువారం సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులకు ప్రభుత్వ సబ్సిడీలు, పథకాలు వర్తించవు. వడ్ల కొనుగోలు కేంద్రంలో పంట కొనుగోలు నిలిపివేయబడుతుంది, యూరియా బుకింగ్స్ కూడా ఆగిపోతాయి. ఈ నేపథ్యంలో, రైతులందరూ వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.