సిద్ధిపేట జిల్లా రైతు సంఘం కార్యదర్శి కొంగరి వెంకట్ మావో, ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ధరలు పెంచి రైతులపై భారం మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతో విదేశీ వ్యవసాయ ఉత్పత్తులను సుంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటున్నారని, నూతన విద్యుత్ బిల్లుతో ఉచిత విద్యుత్ ను నిలిపివేసి, బోరుబావుల వద్ద మీటర్లు బిగించాలని ప్రభుత్వం సంకల్పించిందని ఆయన మండిపడ్డారు.