బాధిత కుటుంబానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందజేత

0చూసినవారు
బాధిత కుటుంబానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందజేత
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన నిరుపేద కూలీ నాగి బాబు నిన్న బుధవారం కోహెడ మండలం తంగళ్ళపల్లి వాగుగడ్డ వద్ద జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, మృతుని దహన సంస్కారాల కోసం గురువారం రూ. 5000 ఆర్థిక సహాయాన్ని పంపించారు. ఈ సహాయాన్ని గ్రామ బీఆర్ఎస్ నాయకులు, గ్రామ సర్పంచ్ గంగా పరుశరాములు సమక్షంలో మృతుని కుటుంబానికి అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్