సిద్దిపేటను దేశంలో, రాష్ట్రంలో అగ్రభాగాన నిలపాలనే లక్ష్యంతో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కూరగాయల మార్కెట్ ను రెండంతస్తుల భవనంగా, సౌకర్యాలతో మోడల్ రైతుబజార్ గా తీర్చిదిద్దారు. ఇటీవల ఆయన మహిళా సంఘాల సభ్యుల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి, రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పని చేయని స్క్రీన్లను పరిశీలించి, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారం రోజుల్లోనే వాటిని ఏర్పాటు చేశారు.