మహిళా సంఘాల భవనాలకు కోటి నిధులు మంజూరు

1529చూసినవారు
మహిళా సంఘాల భవనాలకు కోటి నిధులు మంజూరు
సిద్దిపేట రూరల్ మండల మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి రూ. 1 కోటి నిధులు మంజూరు అయ్యాయి. జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూజల హరికృష్ణకు మండల కాంగ్రెస్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ఐదు మండలాలకు కలిపి మహిళా సంఘాల భవనాల నిర్మాణం కోసం రూ. 4 కోట్ల 80 లక్షల నిధులు మంజూరు కావడం సంతోషకరమని నాయకులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్