సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి. సుదర్శన్ బాధ్యతలు చేపట్టారు. వీరి స్థానంలో సాయిరమాదేవి బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ ఫ్యామిలీ కోర్టు నుంచి జి. సుదర్శన్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సుదర్శన్ సిద్దిపేట కోర్టు ఆవరణలో పోలీసు గౌరవ వందనం స్వీకరించి బాధ్యతలు చేపట్టారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ప్రధాన న్యాయమూర్తిని పలువురు న్యాయమూర్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు.