సిద్దిపేట జిల్లాలోని రాఘవేంద్రనగర్ కాలనీ2లో ఆదివారం గజానంద స్నేహబృందం ఆధ్వర్యంలో తృతీయ వార్షికోత్సవం సందర్భంగా అష్టావధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అష్టకాల విద్యాచరణ్ అవధానం చేయగా, పృచ్చకులుగా పలువురు పాల్గొన్నారు. ముఖ్యఅతిథులుగా ఉమాపతి రామేశ్వరశర్మ, మాడుగుల మురళీధరశర్మ, సభాధ్యక్షులుగా సింగీతం నరసింహారావు, ఆత్మీయ అతిథిగా అవధాని మంచినీళ్ళ సరస్వతి రామశర్మ హాజరయ్యారు. కవులు పెందోట వెంకటేశ్వర్లు, మిట్టపల్లి పర్శరాములు, మల్లంల కనకయ్య, పప్పుల రాజిరెడ్డి, బస్వ రాజ్ కుమార్, పిన్నింటి మహేంద్రారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ అష్టావధానం ప్రేక్షకులను విశేషంగా అలరించింది.