గాంధీజీ ఆశయాలను ఆచరించాలి

1చూసినవారు
గాంధీజీ ఆశయాలను ఆచరించాలి
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వాసవి క్లబ్ ఇందిరమ్మ కాలనీ ఆధ్వర్యంలో లింగారెడ్డిపల్లిలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంకాల శ్రీనివాస్ మాట్లాడుతూ గాంధీజీ చూపిన సత్యం, అహింసా మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కొత్తూరి బాలరాజ్, పూర్వపు అధ్యక్షులు కృష్ణమూర్తి, పి. ఆర్. ఓ కాల్వ శ్రీనివాస్, తాటిపల్లి మల్లేశం, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్