కొమురవెల్లి మండలం గురువన్నపేట గ్రామానికి చెందిన వరిగంటి సత్తెమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాన్ని గుర్తించి మృతురాలి కుటుంబానికి బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొంగు రాజేందర్ రెడ్డి బుధవారం రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి నా వంతు సహాయకారంగా సహాయం అందించడంలో ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.